Our Mission

Mother Tongue, or first language plays a very significant role in the overall development of a child. One of the greatest gifts a parent can give a child is to pass on their language and culture. The first language a baby hears in mother’s womb and then while growing up from an infant to a young child, helps to develop their sense of identity and belongingness in this global world, shapes their thoughts and expressions and encourages them to explore more into their culture and traditions. Telugu Badi ‘s mission is to encourage our younger generation to learn our mother tongue – Telugu, to understand the little nuances and  relish the sweetness of the language, explore all the possibilities of expression it offers. We work with the belief that learning our Mother Tongue can never be a hindrance to anything but in fact it paves the way to master other languages with less difficulty and enhances the intellect and the creative self-expression.


మాతృభాష తల్లిదండ్రులు తమ బిడ్డలకి ఇచ్చే గొప్ప వరం. గర్భస్త శిశువు నుంచి బుడిబుడి నడకల వయస్సు వరకూ ప్రతి చిన్నారి వినే భాష మాతృభాష. అది వారికి ఒక వ్యక్తిత్వము ఏర్పడడానికి, ఈ వసుధైక కుటుంబములో తనకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకోవటానికి దోహదం చేస్తుంది. మన సంస్కృతి, సాంప్రదాయాల పట్ల అవగాహన, గౌరవభావం ఏర్పడడానికి, భావ వ్యక్తీకరణ పెంపొందించుకోవటానికి ఎంతగానో సహాయపడుతుంది. ఈ సూత్రాన్ని నమ్మి భావి తరాలకు మన మాతృభాష నేర్పించాలన్న ఆశయముతో, స్వఛ్ఛంద సేవకుల సమిష్ఠి కృషితో ముందుకు సాగుతోంది తెలుగు బడి. తేనెలూరు తెలుగులోని మాధుర్యాన్ని ఆస్వాదించమని, ఎందరో తెలుగు మహా కవుల కలముల నుండి జాలువారిన రచనలలో నిక్షిప్తమై ఉన్న నిగూఢార్థాలని వెలికితీయమని తెలుగు వారందరికీ పిలుపునిస్తోంది. అవని నలువైపుల తెలుగు వెలుగులు విరజిమ్మాలని ఆకాంక్షిస్తూ, మన భాషను పరిరక్షించుకోవాలనే సంకల్పముతో ముందడుగు వెస్తోంది తెలుగు బడి..